Svamitva Scheme: స్వమిత్వ పథకం కింద దాదాపు 50 లక్షల ఆస్తి..! 8 d ago
ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 27న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరం, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు- జమ్మూ-కాశ్మీర్, లడఖ్ మొత్తం 10 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలలో గ్రామాల్లోని ఆస్తి యజమానులకు, స్వమిత్వ పథకం కింద దాదాపు 50 లక్షల ఆస్తి ధ్రువపత్రాలను(ప్రాపర్టీ కార్డులు) పంపిణీ చేసారు.
స్వమిత్వ పథకం గురించి..
స్వమిత్వ (సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియా) పథకం కింద డ్రోన్ సర్వే టెక్నాలజీని ఉపయోగించి గ్రామాల్లో ఇళ్ళ ఖాళీస్థలాల వివరాలను నమోదు చేసి ఆన్లైన్ లో రికార్డులు తయారు చేయాలని, ఆస్తి యజమానులకు ప్రాపర్టీ కార్డులను పంపిణీ చేయలన్న ఉద్దేశ్యంతో కేంద్రప్రభుత్వం 2020 లో ఈ పథకాన్ని ప్రారంభించింది. ప్రస్తుతానికి 31 లక్షల గ్రామాలలో డ్రోన్ సర్వే పూర్తయ్యింది. ఇప్పటి వరకు దాదాపు 1.5 లక్షల గ్రామాలకు సంబంధించి కేంద్రప్రభుత్వం 2.2 కోట్ల ఆస్తి కార్డులను సిద్ధం చేసింది. ఈ పథకాన్ని కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ఆయా రాష్ట్రాల పంచాయతీరాజ్ శాఖలు, రెవెన్యూ శాఖలు, సర్వే ఆఫ్ ఇండియాల సహకారంతో అమలు చేస్తోంది.
ప్రయోజనాలు...
ఆన్లైన్లో వివరాలు నమోదు చేయడం ద్వారా ఇంటికి సంబంధించి డాక్యుమెంట్లు ఏవి అవసరమున్నా ఆన్ లైన్ ద్వారా తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఏ అవసరం ఉన్నా మీ సేవ ద్వారా ఇంటికి, ప్లాటుకు సంబంధించిన వివరాలన్నీ పొందవచ్చు.
దీని ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు భూమిపై యాజమాన్య హక్కులు ఇస్తున్నారు. గ్రామాల్లో ప్రజలు భూములపై ఆస్తి హక్కులు పొందడంతో ఆ ఆస్తి ప్రాపర్టీ కార్డును బ్యాంకుల్లో తనఖా పెట్టి ఋణం కూడా తీసుకోవచ్చు.